పెప్సికోకు భారీ షాక్: లేస్ చిప్స్ ప్యాకెట్ మోసంపై వినియోగదారుల కమిషన్ తీర్పు

రిపోర్టర్: సతీష్ స్థలం: జైపూర్

రూపాయల ఐదు లేస్ చిప్స్ ప్యాకెట్లో తక్కువ బరువు ఉన్నట్లు తేలడంతో పెప్సికో సంస్థపై జైపూర్ వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు వెలువరించినట్లు అధికారులు తెలిపారు. ప్యాకెట్లో పదిహేను గ్రాముల బదులు కేవలం నాలుగు గ్రాముల చిప్స్ మాత్రమే ఉండటంతో సేవల్లో లోపంగా కమిషన్ నిర్ధారించింది. ఫిర్యాదుదారునికి వడ్డీతో పాటు మానసిక వేదనకు పరిహారంగా ఐదు వేలు, లీగల్ ఖర్చుల కింద మరో మూడు వేలు చెల్లించాలని పెప్సికో కంపెనీని ఆదేశించింది.