బందానా లుక్‌తో అదరగొట్టిన సల్మాన్ ఖాన్

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

సోదరుడు సొహైల్ ఖాన్ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తలపై బందానా ధరించి, క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించిన ఆయనను చూసి అభిమానులు 'వాంటెడ్' సినిమా రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.