నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు నెట్ ప్రాక్టీస్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన బంతి గిల్ కుడి మోచేతికి బలంగా తగిలింది. తీవ్ర నొప్పితో గిల్ మైదానం వీడగా, ఫిజియోథెరపిస్ట్ అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఆయన బరిలోకి దిగుతాడో లేదోనని వైద్య బృందం పరిశీలిస్తోంది.