ముంబైలో ఘోర ప్రమాదం ఫ్లైఓవర్ పైనుండి కారు పడి ముగ్గురు మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: ముంబై
ముంబైలోని లోటస్ జెట్టీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ పైనుండి కిందపడింది. ఈ భీకర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.