ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా కరువు ముప్పు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆంధ్రప్రదేశ్

భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులపై నిర్వహించిన నూతన శాస్త్రీయ అధ్యయనంలో ఆందోళనకర నిజాలు వెల్లడయ్యాయి. 1971 నుంచి 2022 వరకు 52 ఏళ్ల వాతావరణ వివరాలను విశ్లేషించగా దక్షిణ భారతదేశం వేగంగా ఎండిపోతోందని, తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలిచిందని భారత వాతావరణ శాఖ మరియు నేషనల్ సెంటర్ ఫార్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో తేలింది.