ముగిసిన అంగన్వాడి కార్యకర్తల స్కూల్ రెడీనెస్ తరగతులు

రిపోర్టర్: Pydi. Suryanarayana స్థలం: ఆమదాలవలస

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఐసిడిఎస్ పరిధిలో మూడు రోజులుగా నిర్వహించిన స్కూల్ రెడీనెస్ బాలవికాస్ ప్రోగ్రాం, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. యూత్ క్లబ్ – బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ, శ్రీకాకుళం ఆధ్వర్యంలో, ఇండియా లిటరసీ ప్రాజెక్ట్ (ILP), USA వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కృత్యాధార బోధన పద్ధతులు, ఆటలు, పాటలు మరియు అభినయ గేయాలపై 118 అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్లు ఐసిడిఎస్ అధికారులు వెల్లడించారు.