రాయమాధరం వరకు గోదావరి జలాలు అందించి పంటలను కాపాడాలి
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
ఏన్కూరు మండలంలోని రాయమాధరం వరకు గోదావరి జలాల సరఫరా కొనసాగించి పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం వారు ఎండిపోతున్న పంటలను పరిశీలించి, మరో నెలపాటు సాగునీరు అందించాలని కోరారు. మండలాన్ని కరువు జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.