సినిమాల్లో మహిళల చిత్రీకరణపై నటి తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: సునీల్
స్థలం: India
భారతీయ సినిమాల్లో మహిళలను వస్తువులుగా చూపడంపై తాప్సీ పన్ను మండిపడ్డారు. ప్రేక్షకులు కోరుకుంటున్నదే ఇస్తున్నామనే మేకర్స్ వాదనను ఆమె తప్పుబట్టారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్‌ను వైరల్ చేయడం వల్లనే ఈ ధోరణి పెరుగుతోందని, ఈ మార్పు కోసం ప్రేక్షకులు కూడా పోరాడాలని పిలుపునిచ్చారు. 'పెద్ది', 'టాక్సిక్' చిత్రాలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.