బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న నాని ది ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ఓవర్సీస్ తో పాటు దేశీయంగానూ అద్భుతమైన స్పందన లభిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ 1.1 మిలియన్ డాలర్ల మార్క్ దాటగా, ఇండియాలో మొదటి ఐదు రోజులకు రూ.37 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది.