చంద్రబాబు వైఖరి నచ్చలేదంటూ టీడీపీ నేత జలీల్ ఖాన్ ఫైర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
ముస్లింల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ నేత జలీల్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బున్న వారికే రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కేటాయిస్తున్నారని, ముస్లింలకు మాత్రం చిన్నచిన్న నామినేటెడ్ పోస్టులతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క ముస్లింకూ సీటు కేటాయించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.