భక్తిపారవశ్యంతో పులకించిన శ్రీకాకుళం సప్తగిరి సత్యసాయి మందిరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

సత్యసాయి బాబా శత జయంతి, వినాయక నవరాత్రుల సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని సత్యసాయి మందిరంలో 101 గంటల అఖండ నామ సంకీర్తన శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షుల సతీమణి కమలా త్రివేణి జ్యోతి వెలిగించి దీన్ని ప్రారంభించారు. విశ్వశాంతి, లోక కళ్యాణం కోసమే ఈ సంకీర్తన నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. పూర్ణాహుతి ఈ నెల 22న జరుగుతుందని, ఈ వేడుకకు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు.