కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజా చిత్రం అధికారిక ప్రకటన
రిపోర్టర్: రమేష్
స్థలం: చెన్నై
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కొత్త సినిమా ఎస్కే 27 అధికారికంగా ప్రారంభమైందని చిత్ర యూనిట్ తెలిపింది. పార్కింగ్ చిత్ర దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ను సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోందని వారు వెల్లడించారు. తొలి సినిమాతోనే జాతీయ అవార్డులు అందుకున్న దర్శకుడితో శివకార్తికేయన్ తొలిసారి కలిసి పని చేస్తుండటంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.