పాలకొండలో పౌర్ణమి వేళ భక్తిశ్రద్ధలతో సాగిన అఖండ ధ్యానం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పౌర్ణమి సందర్భంగా ఆదివారం పాలకొండలోని ఋషి యోగ కేంద్రంలో ధనుంజయ్ గురూజీ ఆధ్వర్యంలో పన్నెండు గంటల అఖండ ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలకొండ, వీరఘట్టం మరియు సీతంపేట యోగ కేంద్రాలకు చెందిన యాభై మందికి పైగా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పౌర్ణమి ధ్యానం చేయడం వల్ల మనసులో ఆందోళనలు పూర్తిగా తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని ధనుంజయ్ గురూజీ తెలిపారు.