నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్ఐ ఆత్మహత్య

రిపోర్టర్: మహేష్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న సతీశ్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయిచైతన్య వెంటనే ఘటనాస్థలిని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందగా, పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.