రేపు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం రాజ్ భవన్లో గవర్నర్ను కలవనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణత, మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనపై వారు ఫిర్యాదు చేయనున్నారు. ఎమ్మెల్సీల సస్పెన్షన్, ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపి, తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.