వైసీపీతో తెగతెంపులు: జగన్ పిలిచినా తిరిగి వెళ్లేది లేదన్న విజయసాయిరెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తనను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించరని, ఒకవేళ పిలిచినా వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ పరిణామాలు, సజ్జల రామకృష్ణారెడ్డి నియామకం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తితోనే తాను పార్టీని వీడినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.