నెల్లూరులో ప్రేమ్‌చంద్ హత్య కేసులో ఐదుగురు అరెస్టు

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

నెల్లూరు గ్రామీణ మండలంలో స్నేహితుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ప్రేమ్‌చంద్ హత్యకు గురయ్యాడు. ఈ సంచలన కేసుకు సంబంధించి అపర్ణ, దినేష్, జషాన్, హేమంత్, శీనయ్య సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్స్‌జండర్ అపర్ణతో సాన్నిహిత్యం మరియు పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.