కడపలో నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం

రిపోర్టర్: మహేష్ స్థలం: కడప

ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కడప బైపాస్ రోడ్డు వరకు 5.8 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.304 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ రహదారి జాతీయ రహదారులతో అనుసంధానాన్ని సాధించి సరుకు రవాణాను మరింత వేగవంతం చేస్తుందని వివరించారు.