విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా ఖమ్మంలో ఉపాధ్యాయులకు వినూత్న శిక్షణ
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం రిక్కా బజార్ ఉన్నత పాఠశాలలో నూతన ఉపాధ్యాయులకు తక్కువ ఖర్చుతో సైన్స్ ప్రయోగాలు చేయడంపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా రిసోర్స్ పర్సన్లు విభిన్న ప్రయోగాలను ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు, అధికారులు మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రయోగాల నిర్వహణను నేర్చుకున్నారు.