అవునుమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
రిపోర్టర్: Radha. A
స్థలం: కడెం
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రాంతాలను పసుపు నీళ్లతో కడిగి అవమానించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, పవని గౌడ్, సంధ్యారాణిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.