విద్యార్థుల భాగస్వామ్యంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన ఎంటీఎంసీ
రిపోర్టర్: గోపి
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విద్యార్థులతో చేపట్టిన పొడిచెత్త సేకరణ కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకుంది. మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని సుమారు డెబ్బై ఐదు వేల కిలోల పొడి చెత్తను సేకరించారు. ఈ విశిష్ట ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా పరిశీలించిన ప్రతినిధులు రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు అందజేశారు.