ఆస్కార్ రేసులో ధురంధర్ సినిమా కేవలం నాలుగు ఓట్లు మాత్రమే సాధించింది

రిపోర్టర్: శివ స్థలం: India

మరాఠీ థ్రిల్లర్ గొంధల్ సినిమా 99వ అకాడమీ అవార్డుల కోసం భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమాపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ సభ్యుడు వివేక్ వాస్వానీ స్పందిస్తూ, ఆ సినిమాకు 14 మంది సభ్యుల ప్యానెల్‌లో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా లేకపోవడం వల్లే ఆ చిత్రం ఆస్కార్ రేసులో వెనుకబడిందని ఆయన తెలిపారు.