ఆసక్తికరంగా రాకేష్ వర్రే మాయలేడి సినిమా టీజర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా సినిమా మాయలేడి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మధుమిత సర్కార్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రేమ, పెళ్లి విషయాలపై కచ్చితమైన అభిప్రాయం ఉన్న క్రిష్ అనే యువకుడు, ఫైర్ బ్రాండ్ లాంటి ఆశా అనే అమ్మాయి మధ్య సాగే ఆసక్తికరమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రిష్‌కు గతంలో రూపా అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేదని తెలుసుకున్న ఆశా కోపంతో ఊగిపోతుంది. రూపా గురించి తెలుసుకున్న తర్వాత ఆశా ఏం చేసిందనే ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.