సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధ్యంకాదంటూ మంత్రి డీఎస్బీవీ స్వామి స్పష్టత
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం సాధ్యంకాదని మంత్రి డీఎస్బీవీ స్వామి తేల్చిచెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లు సాధించుకుంటామంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదని, తాము వారికీ పదోన్నతులు కల్పిస్తున్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.