బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిపై తిరుగుబాటు: అజయ్ సింగ్ తీరును తప్పుబట్టిన అసమ్మతి వర్గం

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ సింగ్ ఏకపక్ష నిర్ణయాలపై అసమ్మతి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని ఉపాధ్యక్షుడు రాజేష్ భండారి తెలిపారు. న్యూఢిల్లీలో సమావేశమైన మెజారిటీ యూనిట్ల ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు ఆయన అరాచక పాలనకు వ్యతిరేకంగా కేంద్ర క్రీడా శాఖకు వినతిపత్రం సమర్పించారు. రాజ్యాంగాన్ని మారుస్తూ అధికారాలను తనకే పరిమితం చేసుకున్నారని, ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా అణగదొక్కుతున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.