రవాణాపల్లి పాఠశాలలో ప్రశాంతంగా ముగిసిన ఎస్ఎంసీ ఎన్నికలు
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలంలోని రవాణాపల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిణి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చైర్మన్గా కూడా రమణమ్మ, వైస్ చైర్మన్గా కూడా కనకమహాలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి తమవంతు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.