అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రధాన టీవీ నెట్‌వర్క్‌ల నిరసన

రిపోర్టర్: మహేష్ స్థలం: వాషింగ్టన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉమ్మడి టీవీ కవరేజీని నిలిపివేయడానికి ప్రధాన అమెరికన్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌లు సోమవారం అంగీకరించాయి. సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థను ఉమ్మడి ప్రతినిధిగా వ్యవహరించడానికి వైట్‌ హౌస్‌ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఫాక్స్ న్యూస్ వాషింగ్టన్ బ్యూరో చీఫ్ బ్రయాన్ బౌటన్ ఈ విషయాన్ని మీడియా ప్రతినిధుల బృందానికి తెలియజేసినట్లు సమాచారం.