కాకినాడలో నిరుద్యోగుల భారీ నిరసన, మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలి
రిపోర్టర్: గోపి
స్థలం: కాకినాడ
కాకినాడలో కొండాయపాలెం బ్రిడ్జ్ వద్ద నిరుద్యోగ యువత భారీ ర్యాలీ నిర్వహించి మెగా పోలీస్ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, ఖాళీ పోస్టుల భర్తీ ఆలస్యం వల్ల వయోపరిమితి దాటిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.