అనుమసముద్రంపేట జడ్పీటీసీ ఎన్నికల బరిలో దిగిన రాజేశ్వరమ్మ ప్రచారం ముమ్మరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అనుమసముద్రంపేట

అనుమసముద్రంపేట మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఇందులో భాగంగా జడ్పిటిసి ఎన్నికల్లో వైయస్సార్సీపి పార్టీ అభ్యర్థిగా అనుమసముద్రం గ్రామానికి చెందిన పందిళ్ళపల్లి రాజేశ్వరమ్మ పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఆమె తన నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. స్థానిక ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ఆమె అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం పారదర్శకంగా కొనసాగుతోంది.