తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

రిపోర్టర్: రాజేష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం నుంచి బంగారు వాకిలి వరకు ఆలయ ప్రాంగణాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్యాల పరిమళ జలాన్ని సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ శుద్ధి కార్యక్రమం కారణంగా దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి, ఉదయం 11 గంటల నుంచి భక్తులను అనుమతించారు.