గాంధీ జయంతి వేడుకల్లో నాలుగు కిలోమీటర్లు నడిచిన చిన్నారి దేవాన్షి
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
గాంధీ జయంతిని పురస్కరించుకుని నారాయణపురం మండలం వావిళ్ళపల్లి గ్రామానికి చెందిన చిన్నారి కోల దేవాన్షి నాలుగు కిలోమీటర్లు ఉత్సాహంగా నడక సాగించింది. కోల అనూష మహేష్ దంపతుల మూడు సంవత్సరాల కుమార్తె అయిన దేవాన్షి చిన్న వయసులోనే గాంధీజీ ఆశయాలు, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించేలా నడకలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. ఈ చిన్నారి పట్టుదలను గ్రామస్తులు, సర్పంచ్ ఐతరాజు సరళ చంద్రయ్య అభినందించారు.