ఓటీటీ వేదికగా అక్టోబర్ రెండున బెత్లెహం కుటుంబ యూనిట్ స్ట్రీమింగ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Kerala
మలయాళ చిత్ర పరిశ్రమలో ఘన విజయం సాధించిన బెత్లెహం కుటుంబ యూనిట్ చిత్రం త్వరలో డిజిటల్ మాధ్యమలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం అక్టోబర్ రెండవ తేదీన ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.