ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది వరద ఉధృతి క్రమంగా పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బ్యారేజీ వద్దకు ఐదు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు. పరీవాహక జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, లంక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.