ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారత్లో తీవ్ర కరవు ముప్పు
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారతం తీవ్ర కరవు ముప్పును ఎదుర్కొంటోందని తాజా అధ్యయనంలో తేలింది. 1971 నుంచి 2022 వరకు 52 ఏళ్ల వాతావరణ మార్పులపై భారత వాతావరణ శాఖ మరియు ఇతర సంస్థల పరిశోధకులు అధ్యయనం చేపట్టగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లైమటాలజీలో ప్రచురితమైంది. పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ఎండ తీవ్రత, తూర్పున కరవు పెరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.