భక్తిశ్రద్ధలతో ముగిసిన బొబ్బిలిపేట వినాయక నిమజ్జన వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని బొబ్బిలిపేట గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథునికి భక్తిప్రపత్తులతో వీడ్కోలు పలికారు. గ్రామంలో ప్రతిష్టించిన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కోలాటాల నడుమ కోలాహలంగా సాగిన ఊరేగింపుతో నిమజ్జనం పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు గట్టి ఏర్పాట్లు చేశారు.