కుప్పంలో కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కుప్పం
హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి సమర్పించారు. కెనాల్ వద్ద పసుపు కుంకుమలు, పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హంద్రీనీవా జలం తమ ప్రాంతానికి ఒక గొప్ప వరమని రైతులు, మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సీఎం పర్యటనతో స్థానికంగా పండగ వాతావరణం నెలకొంది.