దారకొండ పంచాయతీలో రైతులకు నాణ్యమైన రాజ్మా విత్తనాలు పంపిణీ చేసిన కూటమి నేతలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కే.వీధి మండలం దారకొండ పంచాయతీలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో రైతులకు రాజ్మా చిక్కుడు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రతి పట్టాదారు రైతుకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఆధునిక సాగు పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కూటమి నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.