'వేదికలు దొరికితే ఐపీఎల్ వేలాన్ని భారత్లోనే నిర్వహిస్తాం': ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్
రిపోర్టర్: మహేష్
స్థలం: ఇండియా
ఐపీఎల్ 2027 సీజన్ వేలాన్ని భారత్లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. గత మూడేళ్లుగా విదేశాల్లోనే వేలం నిర్వహించామని, ఈసారి భారత్లో వేదికల లభ్యతను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ అభిప్రాయాలు సేకరిస్తోందని పేర్కొన్నారు.