కేజీహెచ్ లో భారీ మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి ముందుకువచ్చిన అంకానా

రిపోర్టర్: సతీష్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో నాలుగు వందల పడకల మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి ఉత్తర అమెరికాలోని ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం ముందుకు వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్ తెలిపారు. సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలతో ఐదు అంతస్తుల్ లో నిర్మించనున్న ఈ బ్లాక్ కోసం ది కోట్ల రూపాయల సాయం అందించేందుకు అంకానా ప్రతినిధులు అంగీకరించారని, స్థలం కేటాయింపుపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన శనివారం వెల్లడించారు.