నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై సీపీఐ నాయకుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జి.కె.వీధి
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు భారంగా మారాయని జి.కె.వీధి మండలంలో సీపీఐ నాయకులు తీవ్రంగా విమర్శించారు. 2024తో పోలిస్తే బియ్యం, పప్పు, వంట నూనె, చక్కెర, ఉల్లి, టమాటా ధరలు 60 శాతం నుంచి 105 శాతం వరకు పెరిగాయని వారు ఆరోపించారు. రైతుకు గిట్టుబాటు ధర లేకపోగా, వినియోగదారుడికి సరసమైన ధర లభించడం లేదని, మధ్యలో దళారీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారని తెలిపారు. వెంటనే బ్లాక్ మార్కెట్ అక్రమ నిల్వలను అరికట్టి, రైతు బజార్లను బలోపేతం చేసి నిత్యావసర ధరలను తగ్గించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.