చెకుముకి సైన్స్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక పీసీఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండలస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మున్సిపల్ పరిధి కొత్తపేట జడ్పీహెచ్ఎస్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, ఎస్జీఎన్ బాలికల జడ్పీహెచ్ఎస్ ద్వితీయ స్థానంలో, కేవీపీఆర్ పేట పాఠశాల తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలుగా నిలిచిన విద్యార్థులు త్వరలో జరగనున్న జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నమశ్శివాయం, ప్రధానోపాధ్యాయురాలు శ్యామల తదితరులు పాల్గొన్నారు.