వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసుల పిలుపు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక పద్మశాలి భవన్ లో సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.