పులివెందుల మున్సిపల్ ఎన్నికలు: అన్ని పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పులివెందుల

వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యంత్రాంగం వెల్లడించింది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం ఎనభై పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏడు వందల యాభై మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్ కు వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకున్నారు.