నాగలాపురం వీధి దీపాల ఏర్పాటుకు స్థానిక నాయకుడి విజ్ఞప్తి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఆదోని

ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో వీధి దీపాల కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నాయకుడు కే. రాఘవేంద్ర అధికారులను ఆశ్రయించారు. అయితే ప్రజా సమస్యలపై స్పందించి పనులు చేస్తుండగా ప్లాట్ల యజమాని తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని రాఘవేంద్ర స్పష్టం చేశారు.