రైతు బజార్లలో కిలో ముప్పై ఐదు రూపాయలకు ఉల్లి విక్రయం
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ధరల స్థిరీకరణలో భాగంగా విజయవాడలోని రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను కేవలం ముప్పై ఐదు రూపాయలకే విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సబ్సిడీ ఉల్లి కొనుగోలుకు వినియోగదారులు ఆధార్ లేదా రేషన్ కార్డును తప్పనిసరిగా చూపించాలని, ప్రతి కుటుంబానికి నెలకు రెండు కిలోలు మాత్రమే అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు.