లైంగిక నేరస్థులపై పోలీసుల ప్రత్యేక నిఘా, 3207 మందిపై అఫెండర్ షీట్లు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆంధ్రప్రదేశ్
మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 27 నెలల్లోనే ఏకంగా 3,207 మందిపై సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరిచింది. జియో ట్యాగింగ్, డిజిటల్ మానిటరింగ్ ద్వారా నిందితుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేరాల నియంత్రణకే ఈ కఠిన విధానం తెచ్చినట్లు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు.