ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతల నోటీసులపై బాధితుల కన్నీరు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Khammam

ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఇల్లు కూల్చుకుని ఇందిరమ్మ ఇల్లు కడితే, ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారని ఓ బాధితురాలు కంటతడి పెట్టారు. అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల నిరుపేదలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.