పాత విధానంలోనే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు భర్తీ చేయాలి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

విజయవాడలో నిరుద్యోగ పశువైద్యులు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పాత మెరిట్ మరియు వెయిటేజీ విధానంలోనే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అదనపు డైరెక్టర్ రజనికుమారి కాళ్లకు దండం పెట్టి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో నిరుద్యోగ వైద్యులు ఆందోళన విరమించారు.