స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు: సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం సమావేశమయ్యారు. జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో జనసేనకు ముప్పై శాతం స్థానాలు కేటాయించాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు సమాచారం. పట్టణ స్థానిక సంస్థల తరహాలోనే పదవులు కూడా అదే దామాషాలో కేటాయించాలని కోరినట్లు తెలిసింది. దీనిపై రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.