ఆమనగల్లులో బ్లూక్రాస్ సాయంతో వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ పురపాలక సంఘం పరిధిలో వీధి కుక్కల సంఖ్యను శాస్త్రీయంగా నియంత్రించేందుకు బ్లూక్రాస్ సొసైటీతో మున్సిపాలిటీ ప్రత్యేకంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జంతు సంక్షేమ మండలి నిబంధనల ప్రకారం యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలిరోజు యాభై కుక్కలను ప్రత్యేక కేంద్రానికి తరలించారు. రాబోయే రోజుల్లో అన్ని వార్డుల్లో ఈ శస్త్రచికిత్సలు కొనసాగుతాయని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.